విజయ్‌పై శుభాకాంక్షల వెల్లువ... కానీ సందీప్ వంగా పోస్ట్ వైరల్

  • తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ చారిత్రాత్మక విజయం
  • తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ తొలిసారే ఘనవిజయం
  • విజయ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సందీప్ వంగా పోస్ట్
  • సినిమా శక్తి వ్యవస్థలను కదిలించగలదని వ్యాఖ్య
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందీప్ పోస్ట్
తమిళనాడు సార్వత్రిక ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ చారిత్రాత్మక విజయం సాధించింది. రాజకీయాల్లోకి ప్రవేశించి, తొలి ప్రయత్నంలోనే ఇంతటి ఘనవిజయం అందుకోవడంపై సినీ, రాజకీయ వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు విజయ్‌కు శుభాకాంక్షలు తెలుపుతుండగా, టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

విజయ్ విజయంపై స్పందించిన సందీప్ రెడ్డి వంగా, సినిమాకున్న శక్తిని వివరిస్తూ తన ఎక్స్ ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. "సినిమా అంటే ఇదే. ఇది ప్రజలను కదిలించగలదు, వ్యవస్థలను కదిలించగలదు, ఉనికిని శక్తిగా మార్చగలదు. సినిమా ఇక్కడ స్క్రీన్ పైనుంచి దిగి వాస్తవ క్షేత్రంలో తన శక్తిని నిరూపించుకుంది. ఇది హైప్ కాదు, శబ్దం కాదు.. నిజమైన పవర్" అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయ్‌కు, ఆయన పార్టీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

సందీప్ వంగా పోస్టుకు సోషల్ మీడియాలో రెస్పాన్స్ మామూలుగా లేదు. 71 వేల లైకులు, 10 వేల రీపోస్ట్ లు, 8.57 లక్షల వ్యూస్ వచ్చాయి.

Vijay TVK
Tamilaga Vetri Kazhagam
TVK Party
Sandeep Reddy Vanga
Tamil Nadu Elections
Ilayathalapathy Vijay
Tamil Politics
Sandeep Vanga Post
Viral Post

More Telugu News